ASR: పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సీఐ ఎస్.రామారావు గురువారం సందర్శించారు. విద్యార్థులకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అపరిచితుల మోసాలకు దూరంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మానవ అక్రమ రవాణా నిర్మూలనకు అందరూ సహకరించాలని కోరారు.
వార్తలు
'కళాశాలలో మానవ అక్రమ రవాణాపై అవగాహన'


