హైదరాబాద్: 28°C
వార్తలు

'మాజీ ఎమ్మెల్యేపై ఆరోపణలు'

GNTR: గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ దళిత యువకుడిపై దాడి, కిడ్నాప్‌కు పాల్పడ్డారని ఏపీ మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో మాట్లాడుతూ.. వైసీపీ నేతల రౌడీయిజం ఇంకా కొనసాగుతోందని మండిపడ్డారు. నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని తెలిపారు.