KMR: బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల దాడిలో చిన్నారులు గాయపడటం బాధాకరమని మున్సిపల్ ఛైర్‌పర్సన్ కాసుల విజయ తెలిపారు. పట్టణంలో కుక్కలతో పాటు కోతుల బెడద కూడా ఉందని పేర్కొన్నారు. ఈ సమస్యల నివారణకు మున్సిపాలిటీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని, శుక్రవారం నుంచి ప్రత్యేక బృందాలు కుక్కలు, కోతులను పట్టుకునే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాయని వెల్లడించారు.
వార్తలు
వీధి కుక్కలు, కోతుల నియంత్రణకు చర్యలు


