AP: ఉద్యోగుల JACతో చర్చలు సానుకూలంగా జరిగాయని.. RTC MD బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. 90 శాతం సమస్యలకు పరిష్కార మార్గం దొరికిందన్నారు. ఉద్యోగులు డిస్‌ప్లేస్ కాకుండా చర్యలు తీసుకుంటామని, 750 ఎలక్ట్రికల్ బస్సులను 12 డిపోలకు కేటాయిస్తామని ప్రకటించారు. ఈ-బస్సులపై డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని వెల్లడించారు. RTC బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.
వార్తలు
సానుకూలంగా JACతో చర్చలు: RTC MD


