హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు పులివెందులకు జగన్

AP: YCP అధినేత జగన్‌కి వరుసకు పెదనాన్న, కడప MP అవినాష్‌రెడ్డి సొంత పెదనాన్న YS ఆనంద్‌రెడ్డి నిన్న కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆయన పులివెందులలో మృతిచెందారు. ఇవాళ మధ్యాహ్నం డిగ్రీ కళాశాల రోడ్డులోని YS కుటుంబ సభ్యుల సమాధుల తోటలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ CM జగన్‌ దంపతులు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.