హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఆ స్కూళ్లలో ఆన్‌లైన్ క్లాసులు

TG: హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల తరుణంలో స్కూళ్లకు పోలీసులు కీలక సూచన చేశారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని స్కూళ్లకు.. ఇవాళ ఆన్ లైన్ లేదా వర్చువల్ క్లాసులు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. ట్రాఫిక్ తగ్గించడం, ఎమర్జెన్సీ సేవలను సజావుగా నిర్వహించడానికి ఈ సూచన చేశామన్నారు పోలీసులు. వర్షాలు పడే ఇతర చోట్ల కూడా ఇలాగే క్లాసులు నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.