హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్ గాంధీకి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు దాఖలు చేశారు. సభలో అగౌరవకరమైన భాషను ఉపయోగించినట్లు అందులో పేర్కొన్నారు. ఈ నోటీసును స్వీకరించాలని.. సమగ్ర పరిశీలన కోసం ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్‌ను కోరారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కేంద్రమంత్రి అమిత్ షాపై రాహుల్ తీవ్రమైన, నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆరోపించారు.