హైదరాబాద్: 28°C
వార్తలు

'బంగ్లాదేశ్‌లో అడుగు పెట్టగానే షేక్‌ హసీనా అరెస్టు'

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా తమ దేశంలో అడుగు పెట్టిన వెంటనే అరెస్టు చేస్తామని ఆ దేశ మంత్రి అసదుజ్జమాన్ స్పష్టం చేశారు. మరణశిక్ష పడిన ఆమెకు నేరుగా కోర్టులో లొంగిపోయే అవకాశం కూడా దక్కకపోవచ్చని.. ఆలోపే అరెస్టు చేస్తారన్నారు. చట్టం కల్పించిన అధికారాన్ని తాము వినియోగిస్తామని చెప్పారు. హసీనాకు తిరిగి దేశానికి వచ్చే హక్కు ఉందని.. కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు.