హైదరాబాద్: 28°C
వార్తలు

దేశ ఆత్మను ఎవరూ మార్చలేరు : ప్రియాంక

భారత హాకీ జట్టు నీలం జెర్సీ స్థానంలో ప్రపంచకప్‌ కోసం కాషాయ రంగు జెర్సీని ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. జెర్సీ మార్పు ఒక్కటే కాదని, చరిత్రను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. కేవలం జెర్సీనే మార్చగలరని.. దేశ ఆత్మను మాత్రం మార్చలేరన్నారు. భారత స్వాతంత్ర్య‌ పోరాటం అహింస, సత్యం అనే విలువలపై నిర్మితమైందని పేర్కొన్నారు.