JGL: కోరుట్ల మండలం కల్లూరు వాగును జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, వరద ప్రవాహాలు ఉన్న వాగులు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల భద్రతకు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
వార్తలు
అత్యవసరమైతేనే బయటకు రావాలి: కలెక్టర్


