హైదరాబాద్: 28°C
వార్తలు

అమిత్ షా బాధ్యత వహించాలి: అభిజిత్

విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసుల దాడికి కేంద్రమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిమాండ్ చేశారు. అమిత్ షా చెప్పడం వల్లే పోలీసులు ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారని పేర్కొన్నారు. పెల్లెట్ గన్స్ వాడటం తాను కళ్లారా చూశానన్నారు. కసబ్ లాంటి ఉగ్రవాదులపై వాడాల్సిన ఏకే- 47లను బీహార్‌లో యువతపై ఎక్కుపెట్టడం ఏమిటని ప్రశ్నించారు.