హైదరాబాద్: 28°C
వార్తలు

మెటాకు కేంద్రం మరోసారి నోటీసులు

ఇటీవల ప్రధాని మోదీ వీడియో సందేశం పోస్టును ఫేస్‌బుక్ తొలగించటంపై కేంద్రం మరోసారి మెటాకు నోటీసులు జారీ చేసింది. అత్యున్నత స్థాయి ప్రతినిధులతో వచ్చి వివరణ ఇవ్వాలని మెటాను ఆదేశించినట్లు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి కృష్ణన్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. ప్రముఖులకు చెందిన ఖాతాల విషయంలో కొత్త రక్షణ విధానాలను ప్రవేశపెట్టినట్లు మెటా తెలిపిందని చెప్పారు.