హైదరాబాద్: 28°C
వార్తలు

బ్లాక్ స్పాట్లను పరిశీలించిన ఎస్పీ, కలెక్టర్

ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు కలెక్టర్ రాజబాబు గురువారం పరిశీలించారు. నేషనల్ హైవే రవాణా శాఖ అధికారులతో కలిసి ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలని పరిశీలించి ప్రమాదాల నివారణపై చర్చించారు. ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో సిబ్బందితో కలెక్టర్ మాట్లాడారు.