హైదరాబాద్: 28°C
వార్తలు

వందేమాతరం బిల్లుపై ఓవైసీ మండిపాటు

వందేమాతరం బిల్లుపై AIMIM చీఫ్ ఓవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనగణమన పాడినప్పుడు దానిలో ఈ దేశం, ఇక్కడి ప్రజలు కనిపిస్తారని చెప్పారు. కానీ వందేమాతరం ఆలపించడం దేవుళ్లు, దేవతల ఆరాధనతో కూడుకున్నదని పేర్కొన్నారు. 1950లో మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఎలాంటి అధికారిక తీర్మానం లేకుండానే వందేమాతరం గేయాన్ని జాతీయ గేయంగా ప్రకటించి పొరపాటు చేశారని అన్నారు.