హైదరాబాద్: 28°C
వార్తలు

గ్యాస్ నిల్వలపై మోదీ సమీక్ష

పశ్చిమాసియాలో రోజురోజుకూ ఆందోళనలు ఉద్ధృతం అవుతున్న నేపథ్యంలో దేశంలో గ్యాస్ నిల్వలపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. దేశంలో ఇంధన సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు వీలుగా గ్యాస్ సరఫరా మార్గాలను దృష్టి సారించాలని సూచించారు. నిరంతరం పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.