హైదరాబాద్: 28°C
వార్తలు

హుండీ లెక్కింపుతో ఆలయానికి ఆదాయం

ATP: గుంతకల్ కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ కానుకలను గురువారం లెక్కించారు. ఆలయ ఈఓ విజయ రాజు మాట్లాడుతూ.. 77 రోజుల హుండీ కానుకలను లెక్కింపు చేయగా రూ. 54,42,524, బంగారం 14 గ్రాముల 300 మిల్లీ గ్రాములు, వెండి 770 గ్రాములు, విదేశీ కరెన్సీ 10 డాలర్లు అరబ్ కంట్రీ 15 దినమ్స్, అన్నదానం హుండీ ద్వారా రూ.1,41,629 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.