PPM: సీతంపేట మండలం సోమగండ గ్రామంలో కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్‌తో పాటు ఆరోగ్య పరిస్థితి, ప్రభుత్వ సేవలపై ఆరా తీశారు. సమస్యలు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. నిర్ణీత తేదీకి ముందే పింఛన్లు అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
వార్తలు
పింఛన్లు అందించిన కలెక్టర్


