హైదరాబాద్: 28°C
వార్తలు

'మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు'

ASR: మెగా డీఎస్సీని కూటమి ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా నిర్వహించిందని రాష్ట్ర జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ గురువారం తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయులు విధుల్లో చేరారని తెలిపారు. అయితే వైసీపీ ఆధారాలు లేకుండా డీఎస్సీపై ఆరోపణలు చేసి, అభ్యర్థుల్లో భయాందోళనలు సృష్టిస్తోందన్నారు. డీఎస్సీపై చేసిన ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా చూపలేక కోర్టులోనూ వెనక్కి తగ్గారన్నారు.