హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: చెరువులో భారీగా చేరిన వరద

SRD: మండల కేంద్రమైన కంగ్టి శివారులోని పెద్ద చెరువులో గురువారం భారీగా వరద నీరు చేరింది. గత మూడు రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గ్రామానికి ఎగువ ప్రాంతం నుంచి వరద జోరుగా పారుతూ చెరువులో కలిశాయి. ఈ ఒక్కరోజు సగానికి పైగా చెరువు నిండిందని స్థానిక రైతులు తెలిపారు. ఇలాగే వర్షం కురిస్తే అలుగు పారే అవకాశం ఉందని చెప్పారు.