హైదరాబాద్: 28°C
వార్తలు

అటవీ హక్కుల చట్టం అమలుపై శిక్షణ

ASRడుంబ్రిగుడ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం అటవీ హక్కుల చట్టం-2006 పటిష్ట అమలుపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ, అటవీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులకు చట్టం అమలు విధానం, బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లాలం సీతయ్య, తహసీల్దార్ కోట శంకర్రావు, మాస్టర్ ట్రైనీ, డిప్యూటీ ఎంపీడీవో మూర్తి పాల్గొని అధికారులకు సూచనలు చేశారు.