రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వ్యాఖ్యలపై ఎన్డీఏ ఎంపీలు నిరసన చేపట్టారు. విద్యావ్యవస్థ, సిలబస్‌పై ఖర్గే చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మనుస్మృతిపై ఖర్గే వ్యాఖ్యలతో సమాజంలో అశాంతి వస్తుందని కేంద్రమంత్రి జేపీ నడ్డా మండిపడ్డారు. మనుస్మృతి గురించి సభలో ప్రస్తావించడం సరికాదన్నారు. మనుస్మృతి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని చెప్పారు.
వార్తలు
మనుస్మృతి వ్యాఖ్యలను తొలగిస్తాం: నడ్డా


