హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా మోదకొండమ్మ తల్లి పండగ

AKP: కోటవురట్లలో మోదకొండమ్మ తల్లి పండగను గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామం నుంచి గ్రామస్తులు డప్పులతో గ్రామ సమీపంలో పొలాల్లో ఉన్న అమ్మవారి ఆలయానికి మేకపోతులు కోళ్లు పసుపు కుంకుమ తీసుకువెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.