హైదరాబాద్: 28°C
వార్తలు

10 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి: ఖర్గే

దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీల్లో 10 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే  రాజ్యసభలో ప్రస్తావించారు. టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా వికసిత్ భారత్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. వర్సిటీల్లో వీసీలు, ప్రొఫెసర్లను RSS వాళ్లనే తీసుకుంటున్నారని ఆరోపించారు. అర్హతలు లేకుండానే వర్సిటీల్లో వారిని నియమిస్తున్నారని మండిపడ్డారు.