హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ లీకేజీపై దర్యాప్తు జరుగుతోంది: జితేంద్రసింగ్

కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేయలేదని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. ఇప్పటికే నీట్ పేపర్ లీక్ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. లీకేజీ నిందితులకు కఠిన శిక్ష వేయటం కోసమే బిల్లులో నిబంధనలను రూపొందించినట్లు చెప్పారు. దోషులకు విధించే జైలు శిక్షను పదేళ్లకు, అలాగే జరిమానాను రూ.కోటి నుంచి రూ.10 కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు.