హైదరాబాద్: 28°C
వార్తలు

లష్కర్ బోనాలకు గవర్నర్‌కు ఆహ్వానం

HYD: మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. సికింద్రాబాద్‌లో నిర్వహించనున్న ఆషాఢ జాతర (లష్కర్ బోనాలు) ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు. మొత్తం కార్యక్రమంపై వివరాలు తెలియజేశారు.