హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రొద్దుటూరులో 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం

KDP: ప్రొద్దుటూరు పట్టణంలోని ఈరోజు 25వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మైనారిటీ నాయకుడు నూరి, బూత్ ఇన్‌చార్జీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.