హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యసభకు యాంటీ పేపర్ లీక్ బిల్లు

రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లును కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీలను ఎగువ సభలో ప్రస్తావించారు. ఈ పేపర్ లీకేజీలను అరికట్టేందుకే చట్టంలో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ బిల్లు నిదర్శనమని పేర్కొన్నారు.