హైదరాబాద్: 28°C
వార్తలు

సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల సంఘం వినతి

GNTR: వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గురువారం ఇంఛార్జ్ కమిషనర్‌ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులతో నెలకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని, మౌలిక వసతులు, సెలవులు, మెడికల్ బిల్లుల పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.