హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలు.. ఐదుగురు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా ఐదుగురు మృతిచెందారు. రాయపూర్, బస్తర్, దుర్గ్ డివిజన్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఒడిశాలో వరదలు తగ్గుముఖం పట్టాయి. భద్రాక్, బాలేశ్వర్, జాజపూర్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు రెవెన్యూ మంత్రి సురేష్ వెల్లడించారు.