హైదరాబాద్: 28°C
వార్తలు

సామర్లకోటలో అభివృద్ధి పనులకు శ్రీకారం

KKD: సామర్లకోట మున్సిపాలిటీ 4వ వార్డులో సుమారు రూ. 21 లక్షల ఎస్సీ, ఎస్పీ నిధులతో చేపట్టనున్న ఆర్‌సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి (తుమ్మల బాబు), టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాగ్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.