బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ చొరవతో గర్భిణీలు, బాలింతల కోసం ఉచిత పోషకాహార కిట్ల పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లబ్ధిదారులకు ఈ 'పోషణ్ కిట్లు' అందజేశారు. గెయిల్ ఇండియా సీఎస్ఆర్ నిధులతో అవంత్, కృష్ణప్రసాద్ ఫౌండేషన్‌లు సంయుక్తంగా నిర్వహించాయి. ఎంపీకి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
ఇంకొల్లులో బాలింతలకు పోషణ్ కిట్ల పంపిణీ


