హైదరాబాద్: 28°C
వార్తలు

'సజీవ సమాధి’ స్టంట్.. వ్యక్తి మృతి

సజీవ సమాధి స్టంట్ బెడిసికొట్టి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హర్యానాలోని నూహ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఖోరీ కలాన్ గ్రామంలో దీపక్ అనే వ్యక్తి 'సజీవ సమాధి' స్టంట్ చేశాడు. నిర్వాహకులు ఓ సంచిలో అతడిని బంధించి గుంతలో కప్పేశారు. 24 గంటల తర్వాత బయటకు తీస్తామని చెప్పారు. అయితే, 36 గంటల తర్వాత బయటకు తీయగా అప్పటికే అతడు ఊపిరాడక చనిపోయాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.