BPT: చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన చిన్నారి చుండూరు సుహాన్ష్ వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.4,72,885 విలువైన LOC మంజూరైంది. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు ప్రత్యేక సిఫార్సుతో ఈ సహాయం లభించింది. మంజూరైన పత్రాన్ని బాధిత కుటుంబానికి అందజేసిన ఎమ్మెల్యే, పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
వార్తలు
చిన్నారి చికిత్సకు రూ.4.72 లక్షల చెక్కు!


