ASR: కొయ్యూరు మండలం తుమ్మలబంధ ఎంపీపీ పాఠశాల అధ్వానంగా తయారైంది. పాఠశాల భవనం స్లాబ్ పై పెచ్చులు ఊడిపోయి, ఎప్పుడు కూలుతుందో తెలీని ప్రమాదకర పరిస్థితి నెలకొందని స్థానికులు, పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు భవనం లోపల, బయట వరద నీరు కారిపోతుంది. దీని కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు స్పందించి భవనానికి మరమ్మతులు చేపట్టాలన్నారు.
వార్తలు
'అధ్వానంగా మారిన ఎంపీపీ పాఠశాల'


