హైదరాబాద్: 28°C
వార్తలు

2 రోజుల్లో 37 మంది హతం: జేఏఏసీ

పీవోకేలో నిరసనలు చేస్తున్నవారు భారత్ లాంటి శత్రువులని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. ప్రదర్శనలు నిర్వహిస్తున్నవారితో సంప్రదింపులు జరిపేది లేదన్నారు. మరోవైపు పాకిస్తాన్ భద్రతా దళాలు గత రెండు రోజుల్లో 37 మందిని హతమార్చినట్లు జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ వెల్లడించింది. జేఏఏసీ బృందం తనను కలిసి 38 డిమాండ్లను ప్రతిపాదించిందని ప్రధాని సలహాదారు సనావుల్లా పేర్కొన్నారు.