హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రాజెక్టులోకి 3,935 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 3,935 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.802 TMCలు కాగా ప్రస్తుతం 7.466 TMCల నీరు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు నుంచి ఆవిరి, లీకేజీ రూపంలో 145 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోందన్నారు.