NRML: భైంసాలోని గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వస్తోంది. గురువారం ఉదయం అధికారుల వివరాల ప్రకారం.. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా, ప్రస్తుతం 355.8 మీటర్ల నీటిమట్టం నమోదైంది. అధికారులు అప్రమత్తమై వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
వార్తలు
గడ్డేన్న ప్రాజెక్టుకు 4,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో


