హైదరాబాద్: 28°C
వార్తలు

'లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడితే కఠిన చర్యలు'

PPM: భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని DMHO విజయలక్ష్మి హెచ్చరించారు. జిల్లాలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. స్కానింగ్ కేంద్రాలు తప్పనిసరిగా PCPNDT చట్టం కింద నమోదు చేసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1800 2332447 కు ఫిర్యాదు చేయాలని కోరారు.