హైదరాబాద్: 28°C
వార్తలు

ఆందోళన విరమించిన రైతులు

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రైతులు తమ ఆందోళన విరమిస్తన్నట్లు ప్రకటించారు. 60 శాతం పెసర పంట కొనుగోలుకు ప్రభుత్వం అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ఎరువుల పంపిణీకి ఈ-టోకెన్ విధానం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా, సీఎం మోహన్ యాదవ్, కేంద్రం మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఇంటి వద్ద రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.