హైదరాబాద్: 28°C
వార్తలు

కాళేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం

BHPL: మహాదేవపురం మండలంలోని కాళేశ్వర దేవస్థానం ఆలయాలు, గోపురాలు, ప్రాకారాల తొలగింపు ప్రక్రియకు గురుపౌర్ణమి సందర్భంగా శ్రీకారం చుట్టారు. టెండర్ దక్కించుకున్న శ్రీశివరామ కంపెనీ పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులు ప్రారంభించింది. మరో రెండు, మూడు రోజుల్లో భారీ యంత్రాలతో తొలగింపు పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈవో మహేశ్ తదితరులు పాల్గొన్నారు.