హైదరాబాద్: 28°C
వార్తలు

నిధుల మళ్లింపుపై హర్షకుమార్ విమర్శలు

కోనసీమ: రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ. 30 వేల కోట్ల నుంచి రూ. 40 వేల కోట్ల వరకు SC, ST సబ్ ప్లాన్ నిధులు ఉన్నాయని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. బుధవారం రాజోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నిధులను ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ఖర్చు చేయకుండా ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. రాజోలులో ఎస్సీ హాస్టల్ భవనాన్ని కూల్చి ఏడాదిన్నర అవుతున్నా ఎందుకు నిర్మించలేదన్నారు.