హైదరాబాద్: 28°C
వార్తలు

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

KMM: రైతు భరోసా ద్వారా ప్రతి ఎకరానికి రూ. 6 వేల చొప్పున కేవలం 9 రోజుల్లోనే రూ. 9,200 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం స్పష్టం చేశారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రూ.2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ ద్వారా 25 లక్షల మంది రైతులకు రూ. 21,000 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గించామన్నారు.