హైదరాబాద్: 28°C
వార్తలు

పరిశ్రమల స్థాపనపై కలెక్టర్ సమీక్ష

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. పెట్టుబడుల సదస్సులో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు త్వరితగతిన ఉత్పత్తి దశకు రావాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలకు కావలసిన అనుమతులను సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వేగవంతంగా మంజూరు చేయాలని స్పష్టం చేశారు.