హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు

దేశవ్యాప్తంగా రుతు పవనాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో పాటు మధ్యభారతంపై తీవ్ర అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతోంది. దీని ప్రభావం వల్ల ఇవాళ పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యప్రదేశ్, గుజరాత్‌తో పాటు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని IMD పేర్కొంది.