హైదరాబాద్: 28°C
వార్తలు

సీజన్‌లో తొలిసారి జూరాల 10 గేట్లు ఎత్తివేత

TG: జోగులాంబ గద్వాల్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో సీజనులో తొలిసారి జూరాల ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి 38,790 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఉదయానికి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో లక్ష క్యూసెక్కులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లోని 10 యూనిట్లలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.