AP: YCP అధినేత జగన్ ఇవాళ శ్రీకాకుళం రానున్నారు. అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్ కానున్నారు. జగన్ పర్యటనపై జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ పర్యటనకు జన సమీకరణ చేయకూడదని, ములాఖత్ కోసమే అనుమతి తీసుకున్నారన్నారు. బహిరంగ సభ, ర్యాలీకి అనుమతి లేదన్నారు. జన సమీకరణ చేస్తే చర్యలుంటాయని SP మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
వార్తలు
జగన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలు


