TG: జోగులాంబ గద్వాల్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 53 వేల క్యూసెక్కులుగా ఉండగా.. 46,060 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.12 మీటర్లకు నీటిమట్టం చేరింది. 4 యూనిట్ల నుంచి అధికారులు జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
వార్తలు
జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద


