హైదరాబాద్: 28°C
వార్తలు

గ్యాంగ్‌రేప్‌ నిందితులపై స్థానికుల దాడి

ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో 19 ఏళ్ల యువతిని అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులపై స్థానికులు ఆగ్రహంతో దాడికి దిగారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులు నిందితులను సంఘటనా స్థలానికి తీసుకురాగా, అక్కడ గుమిగూడిన జనం ఒక్కసారిగా వారిపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.