హైదరాబాద్: 28°C
వార్తలు

నిధుల దుర్వినియోగంపై DLPO విచారణ

ASF: బెజ్జూర్ మండలం సలగుపల్లి గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై DLPO హరి ప్రసాద్ బుధవారం విచారణ చేపట్టారు. పంచాయతీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, వార్డు సభ్యుల సమక్షంలో విచారణ జరిపినట్లు తెలిపారు. అట్టి రికార్డులను సీజ్ చేసి స్వాధీనపరచుకొని జిల్లా కలెక్టర్ అందించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.