JGL : భారీ వర్షాలతో ధర్మపురి వద్ద గోదావరి నదిలో వరద పెరిగింది. వాగులు, వంకల నుండి వరద నీరు చేరడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద మరింత పెరిగే సూచనలతో నది ఒడ్డున ఉన్న తాత్కాలిక షెడ్లు, చిరు వ్యాపార దుకాణాలను వ్యాపారులు తొలగించారు. వరద వచ్చినందుకు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నది సమీపంలో ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు.
వార్తలు
VIDEO: ధర్మపురి వద్ద గోదావరి నదిలో పెరిగిన వరద


